రైలు ఢీకొని తల్లి, కూతురు మృతి

25 Jun, 2016 17:12 IST|Sakshi

కుప్పం: పట్టాలు దాటుతున్న తల్లి, కూతురు రైలు ఢీకొని మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్‌కాలనీ వద్ద చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కొత్తపల్లికి చెందిన హల్మాత్(38), ఆమె కూతురు తరానా(11) శనివారం సాయంత్రం మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో తల్లి, కూతురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ మేరకు రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు