పలు రైళ్ల రాకపోకల్లో మార్పు

22 Apr, 2015 01:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కాచిగూడ రైల్వేస్టేషన్ 3వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద చేపట్టనున్న నిర్మాణం దృష్ట్యా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈ నెల 23 నుంచి  జూన్ 21 వరకు  ఈ పనులు కొనసాగుతాయని, అప్పటి వరకు రైళ్ల రాకపోకల్లో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. మిర్జాపల్లి-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు గంట ఆలస్యంగా, నిజామాబాద్-కాచిగూడ ప్యాసింజర్ రైలు బొల్లారం వరకే నడుస్తాయి.

గుంటూరు-కాచిగూడ మధ్య నడిచే ప్యాసింజర్ మహబూబ్‌నగర్ వరకే నడుస్తుంది. కర్నూలు సిటీ-కాచిగూడ ప్యాసింజర్ ఫలక్‌నుమా వరకే నడుస్తుంది. అలాగే మధ్యాహ్నం 1.10 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే కాచిగూడ-మహబూబ్‌నగర్ ప్యాసింజర్ రైలు ఫలక్‌నుమా నుంచి మహబూబ్‌నగర్‌కు రాకపోకలు సాగిస్తుంది. ఇది మధ్యాహ్నం 1.28 గంటలకు  ఫలక్‌నుమా నుంచి బయలుదేరుతుంది.

ఈ మార్పుల దృష్ట్యా ఫలక్‌నుమా-ఉందానగర్‌కు ప్రత్యేక రైలు నడుపుతారు. ఇది ఉదయం 6.25కు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి 6.45కు ఉందానగర్‌కు చేరుకుంటుంది. ఉందానగర్‌లో ఉదయం 8.45కు బయలుదేరి ఉదయం 9.05 గంటలకు ఫలక్‌నుమా చేరుకుంటుంది.
 

మరిన్ని వార్తలు