రేపటి నుంచి టీచర్లకు శిక్షణ

11 Sep, 2014 00:24 IST|Sakshi
రేపటి నుంచి టీచర్లకు శిక్షణ

విశాఖపట్నం: ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8 తరగతులకు గణితం, సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ అధికారి బి.నగేశ్ తెలిపారు. ఈ నెల 12 నుంచి అక్టోబర్ 20 వరకూ జరిగే ఈ శిక్షణ తరగతుల్లో జిల్లాలో43 మండలాల్లో ఉన్న 1197 గణితం, 1412 సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు.
 
12నుంచి 15 వరకూ

అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు గవరపాలెం ఎంజీహెచ్‌ఎస్‌లోనూ, గణితం వారికి అనకాపల్లి ఎంపీఎల్ మెయిన్ స్కూల్లోనూ శిక్షణ ఇస్తారు. అచ్యుతాపురం, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ మండలాల సైన్స్ ఉపాధ్యాయులకు గాజువాక జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ, గణితం శిక్షణ తరగతులు మింది జెడ్‌పీహెస్‌లోనూ, నర్సీపట్నం, రోలుగుంట, నాతవరం, కోటవురట్ల మండలాల వారికి సైన్స్ తరగతులు నర్సీపట్నం మెయిన్ జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ, గణితం జెడ్‌పీహెచ్‌ఎస్, నర్సీపట్నంలో నిర్వహిస్తారు. కొయ్యూరు, జీకె వీధి, చింతపల్లి, గొలుగొండ, మాకవరపాలెం మండలాల సైన్స్ తరగతులు నర్సీపట్నం బాలికల హైస్కూల్‌లో, గణితం పి.బి.పల్లి జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ జరుగుతాయి.
 
17 నుంచి 19 వరకూ

చోడవరం, చీడికాడ, దేవరాపల్లి మండలాలకు పీఎస్ పేట జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాలకు తలారసింగి సీఏహెచ్‌ఎస్‌లోనూ, బుచ్చెయ్యపేట, వి.మాడుగుల, రావికమతం మండలాలకు వడ్డాది జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ తరగతులు జరుగుతాయి.
 
22 నుంచి 24 వరకూ


కె.కోటపాడు వారికి సబ్బవరం జీహెచ్‌ఎస్‌లోనూ, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు సైన్స్ తరగతులు గోడిచర్ల జెడ్‌పీహెచ్‌ఎస్‌లో, గణితం నక్కపల్లి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయి. యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల సైన్స్ తరగతులు యలమంచిలి జెడ్‌పీ బాలికల పాఠశాలలోనూ, గణితం యలమంచిలి జెడ్‌పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయిు. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు పెదబయలు, జీటీడబ్ల్యూహెచ్‌ఎస్(బి)లో నిర్వహిస్తారు.
 
అక్టోబర్ 6 నుంచి 8 వరకూ
 
డుంబ్రిగుడ, అరకు వేలీ, అనంతగిరి మండలాల సైన్స్ తరగతులు కంతబాంసుగూడ జీటీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌లో, గణితం డుంబ్రిగూడ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో జరుగుతాయి. ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలకు ఆనందపురం జెడ్‌పీహెచ్‌ఎస్‌లో, అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాల సైన్స్ తరగతులు గవరపాలెం ఎంజీహెచ్‌ఎస్‌లో, గణితం అనకాపల్లి ఎంపీఎల్ మెయిన్ స్కూల్లో జరుగనున్నాయి. నర్సీపట్నం, రోలుగుంట, కోటవురట్ల , నాతవరం మండలాల సైన్స్ తరగతులు నర్సీపట్నం మెయిన్ జెడ్‌పీహెచ్‌ఎస్‌లో, గణితం నర్సీపట్నం బాలికల పాఠశాలలో జరుగుతాయి.
 
9 నుంచి 13 వరకూ

చోడవరం, చీడికాడ, దేవరాపల్లి మండలాలకు పీఎస్ పేట జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ, అచ్చుతాపురం, గాజువాక, పరవాడ, నాతవరం, కోటవురట్ల మండలాలకు గాజువాక జెడ్‌పీహెచ్‌ఎస్‌లోనూ, బుచ్చయ్యపేట, వి.మాడుగుల, రావికమతం మండలాలకు వడ్డాది జెడ్‌పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తారు.
 
14 నుంచి 16 వరకూ

కొయ్యూరు, జీకె వీధి, చింతపల్లి, గొలుగొండ, మాకవరపాలెం మండలాలకు నర్సీపట్నం బాలికల ప్రభుత్వ పాఠశాలలో, యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాలకు యలమంచిలి జెడ్‌పీ బాలికల పాఠశాలలో, ఆనందపురం, పద్మనాభం, భీమిలి మండలాలకు ఆనందపురం, జెడ్‌పీహెచ్‌ఎస్‌లోన, అనకాపల్లి, కశింకోట, మునగపాక మండలాలకు గవరపాలెం ఎంజీహెచ్‌ఎస్‌లో శిక్షణ తరగతులు జరుగుతాయని పీఓ నగేశ్ తెలిపారు.
 

మరిన్ని వార్తలు