మాకూ సమాన హక్కు కల్పించండి

1 Nov, 2017 08:29 IST|Sakshi
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన ట్రాన్స్‌జెండర్లు

ట్రాన్స్‌జెండర్ల డిమాండ్‌

అనంతపురం అర్బన్‌: ‘సమాజంలో మేమూ ఒకరమే.. మమ్మల్ని దూరం పెట్టడం సమంజసం కాదు.. మాకూ సమాన హక్కు కల్పించాలని’ అని ట్రాన్స్‌జెండర్లు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించి, వినతిపత్రం అందజేసేందుకు ‘మనవిజయం’ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రమణమ్మ, మయూరి, హాసిని మాట్లాడారు. ప్రస్తుతం ఏదైనా సర్టిఫికెట్, రేషన్‌ కార్డు, తదితర వాటికి దరఖాస్తు చేసుకుంటే దానిలో పురుష, మహిళ కాలమ్‌ మాత్రమే ఉంచుతున్నారన్నారు. ఇక నుంచి ‘ఇతరులు’ అనే ఆప్షన్‌ కూడా ఉంచాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలనూ  తమకు వర్తింపజేయాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. చదువులేని వారికి ఉపాధి చూపించాలన్నారు. చదువు, ఉద్యోగంలోనూ ఆప్షన్‌ ఉంచుతూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

మరిన్ని వార్తలు