దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌

30 Dec, 2017 03:03 IST|Sakshi

రూ.725 కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించని వైనం

సాక్షి, అమరావతి:  పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ తమ వద్ద రుణంగా తీసుకున్న రూ.725 కోట్లు తిరిగి చెల్లించడం లేదని కెనరా బ్యాంకు స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రాన్స్‌ట్రాయ్‌పై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొంది.

అలాంటి సంస్థ తరఫున పూచీకత్తు(లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆర్థికరంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, జల వనరులశాఖల అభ్యంతరాలను బేఖా తరు చేస్తూ గత నెల 1న కేబినెట్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌ తరఫున బ్యాంకర్లకు లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ ఇచ్చేలా సీఎం చంద్రబాబు  పట్టుబట్టి తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు