అమ్మ కన్నుమూత...

30 Jan, 2019 08:50 IST|Sakshi

అవగాహన లేక గిరిజన గర్భిణి మృతి

కొమరాడ మండలం పూడేసులో ఘటన

విజయనగరం, కొమరాడ: ఆమె గిరిజనురాలు. గర్భం దాల్చింది. వైద్యంపై పెద్దగా అవగాహన లేదు. వైద్యులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది కూడా ఆ గర్భిణికి ప్రసవం, అంతకుముందు పరిస్థితులపై అవగాహన కల్పించలేదు. దీంతో 8 నెలల గర్భిణి నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన హిమరిక దమయంతి (32) అనే గర్భిణి సోమవారం మృతి చెందింది. ఆదివారం పొలం పనిచేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులుఆమె పరిస్థితి విషమంగా ఉందని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

అక్కడి వైద్యులు స్కానింగ్‌ చేసి తల్లి, బిడ్డ పరిస్థితి బాగాలేదని, విజయనగరంలో పెద్దాస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చా రు. కానీ ఆమె అక్కడకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం హఠాత్తుగా మృతి చెందింది. ఆమె హైరిస్క్‌ గర్భిణి కావడం, కిందపడిపోవడంతో ఇంటర్నల్‌ బ్లీడింగ్‌ అయి చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. దీనిపై పలువురు గిరిజన సంఘాల నేతలు ఆధునిక భారతంలో ఇంకా అవగాహన లేక మరణాలు సంభవిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు గిరిజనం ఆరోగ్యంపై దృష్టిసారించాలని కోరుతున్నారు.

ఆస్పత్రి ఫోన్‌ నంబర్లు
ఆస్పత్రి పేరు                  ఫోన్‌ నంబరు
వెంకటరామ ఆస్పత్రి       08922–236759
సిటిస్కాన్‌ డయోగ్నోస్టిక్స్‌    08922–222022
వెంకటాద్రి ఆస్పత్రి              9440018606
సాయి రమ్య ఆస్పత్రి          9440120277
వెంకటపద్మ ఆస్పత్రి         7702612346
తిరుమల ఆస్పత్రి            08922–225850 ,9491759216

మరిన్ని వార్తలు