షెడ్యూల్డ్‌ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు

13 Nov, 2019 05:31 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.

554 గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాగా ప్రకటించాలి

గిరిజన సలహా మండలి సమావేశంలో తీర్మానాలు

సాక్షి, అమరావతి: పునరావాసం కింద గిరిజనులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ప్రాంతాన్ని షెడ్యూల్డ్‌ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించాలని గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానించింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా గిరిజనులను తరలించి పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన హక్కులు కోల్పోతున్నారని సలహా మండలి అభిప్రాయ పడింది.

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో సభ్యులైన గిరిజన ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, బాలరాజు, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, కె ధనలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, డైరెక్టర్‌ పి రంజిత్‌బాషా, అడిషనల్‌ డైరెక్టర్‌ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పుష్పశ్రీవాణి వివరించారు.
- గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతాం.
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కల´బాలి.
ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం పేదలకు ఉగాది నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకు ముందుగానే గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయం. 
బాక్సైట్‌ తవ్వకాల జీవో రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. అలాగే సాలూరులో వైఎస్సార్‌ గిరిజన యూనివర్సిటీ, పాడేరులో మెడికల్‌ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్‌ కాలేజీ, ఏడు గిరిజన ప్రాంతాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు గిరిజనులు అడగకుండానే ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు.

>
మరిన్ని వార్తలు