‘ఆదివాసీ’ స్వయం పాలన ప్రకటించాలి

23 Oct, 2013 03:32 IST|Sakshi

 పినపాక, న్యూస్‌లైన్: ఆదివాసీ ప్రాంతాలకు స్వయం పాలన ప్రకటించాలని మన్యసీమ రాష్ట్ర సాధన సమితి జేఏసీ చైర్మన్ చందా లింగయ్య దొర డిమాండ్ చేశారు. ఆయన మంగవారం ఇక్కడ కొమరం భీం 73వ వర్థంతి సభలో మా ట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతికి కొమరం భీం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. నాడు ఆయన పోరాటాల ఫలితంగానే నేడు గిరి జన చట్టాలు అమలవుతున్నాయన్నారు. మన్యసీమ రాష్ట్రం సాధిం చేంత వరకు ఆదివాసీలంతా అవిశ్రాంతంగా పోరాడాలని కోరారు. మన్యసీమ రాష్ట్రం సాధిస్తే ఆదివాసీ ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి జరుగుతుందని, నిరుద్యోగ సమస్య ఉండదని అన్నారు. గిరిజన చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
 ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులపై ఆదాయాన్ని ఇక్కడి అభివృద్ధికే వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. తొలుత, కొమరం భీం చిత్రపటానికి చందా లింగయ్య దొర పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం, ఆదివాసీ స్వయం పాలన జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుడు వట్టం నారాయణ, జిల్లా నాయకులు వాసం రామకృష్ణ, చందా రాఘవులు, వర్సా శ్రీనివాస్, వజ్జానర్సింహారావు, గుమ్మడి గాంధీ, పి.లక్ష్మినారాయణ, కె.రాజేశ్వరరావు, నాగేంద్రబాబు, ఎ.శ్రీనివాస్, జి.గోపాలకృష్ణ, కె..లక్ష్మణరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు