మా పిల్లలకు ఉద్యోగాలిప్పించండి

8 Dec, 2017 06:49 IST|Sakshi

‘మా పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు లేక ఇంటి పట్టునే ఉంటున్నారు. మీరైనా దయతలచి ఏదైనా ఉద్యోగమిప్పించండి. మీ మేలును మర్చిపోం’ అంటూ గార్లదిన్నె మండలం కె.కె.తండాకు చెందిన గిరిజన మహిళలు వైఎస్‌ జగన్‌తో అన్నారు. గిరి జన మహిళలు లక్ష్మిదేవి, ప్రభావతమ్మ, కాంతమ్మ, అంజినమ్మ, లక్ష్మీదేవి, సుజా త, చంద్రకళ తదితరులు జగన్‌ పాదయా త్ర ముందు లంబాడీ నృత్యం చేశారు. వారి నృత్యాన్ని చూసి జగన్‌ ఆనందం వ్యక్తం చేశారు. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, డ్వాక్రా రు ణాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకు స్పందించిన జగన్‌.. ‘పిల్లలను బాగా చదివించాలని, మన పార్టీ అధికారంలోకి రాగానే చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని’ భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు