‘వంశధార’ వివాదానికి ముగింపు

14 Sep, 2017 01:18 IST|Sakshi
తుది తీర్పు ఇచ్చిన ట్రిబ్యునల్‌
 
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు మధ్య నెలకొన్న వివాదానికి వంశధార జలాల వివాద పరిష్కార న్యాయస్థానం(వీడబ్ల్యూడీటీ) ముగింపు పలుకుతూ తుది తీర్పును వెలువరించింది. కాట్రగడ్డ సైడ్‌ వియర్‌ (మత్తడి– అడ్డుగోడ), నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ బుధవారం ట్రిబ్యునల్‌  తీర్పును వెలువరించింది. ట్రిబ్యునల్‌ చైర్మన్‌ జస్టిస్‌ ముకుందకం శర్మ, జస్టిస్‌ బి.ఎన్‌.చతు ర్వేది, జస్టిస్‌ గులాం మొహమ్మద్‌ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 
 
వంశధార జలాలు చెరిసగం
గొట్టా బ్యారేజ్‌ వద్ద వంశధారలో అందుబాటులో ఉండే నదీ జలాలు 115 టీఎంసీలుగా ట్రిబ్యునల్‌ నిర్ధారించింది. రెండు రాష్ట్రాల మధ్య సెప్టెంబరు 30, 1962న కుదిరిన ఒప్పందం మేరకు వంశధార జలాల్లో చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయించింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌కు అప్పగించాలని.. ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరి సగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా