డామిట్.. కథ అడ్డం తిరిగింది

2 Oct, 2014 08:22 IST|Sakshi
డామిట్.. కథ అడ్డం తిరిగింది

 సాక్షి ప్రతినిధి, ఏలూరు:కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి వద్ద తండ్రీకొడుకుల్ని తుపాకులతో కాల్చి హతమార్చిన ఘటన ఊహించని మలుపులు తిరుగుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో సంచలనం కలిగించిన ముగ్గురి హత్య కేసు ఏలూరు పోలీసుల మెడకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను గుర్తించిన విజయవాడ పోలీసు అధికారులు ఏలూరు పోలీసుల పాత్రపై అనుమానంతో ఒక సీఐ, ఇద్దరు ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గత నెల 24న కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని పెదఅవుటపల్లి వద్ద పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు గంధం మారయ్య, గంధం పగిడి మార య్య హత్యకు గురైన విషయం విదితమే.
 
 అదే రోజు ఉదయం 7గంటల సమయంలో గంధం నాగేశ్వరరావు తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఏలూరులోని ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. అందుకు సరేనన్న సీఐకు నాగేశ్వరరావు రూ.50 వేలు ముట్టజెప్పినట్టు సమాచారం. నాగేశ్వరరావు గన్నవ రం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు నగరంలోని ఎస్‌వీఆర్ ట్రావెల్స్ నుంచి వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. అదే ట్రావె ల్స్ యజమానికి సీఐ ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు వాహనాన్ని అనుసరిస్తారని, వారి కోసం మరో వాహ నం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ట్రావెల్స్ యాజమాన్యం మరో కారును పంపింది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్య ఎక్కిన కారును మరో కారులో ఐడీ పార్టీ కాానిస్టేబుళ్లు అనుసరిస్తూ వచ్చారు. హంతకులు మరో కారులో వెంబడిస్తూ పెదఅవుటపల్లి వద్ద నాగేశ్వరరావు, అతని కుమారులు ప్రయూణిస్తున్న కారును ఢీకొట్టి.. ముగ్గుర్నీ తుపాకులతో కాల్చి చంపారు.
 
 ఈ ఘటనతో ఐడీ పార్టీ పోలీసులు చేష్టలుడిగి కారులోనే కూర్చుండిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని గంధం నాగేశ్వరరావు, అతని కుమారులను తీసుకెళ్లిన కారు డ్రైవర్ నరేష్‌ను వెంటబెట్టుకుని కానిస్టేబుళ్లు ఏలూరు వచ్చేసినట్టు సమాచారం. వారు సదరు సీఐని కలిసినట్టు తెలిసింది.  సీఐ సూచన మేరకే ఆ కానిస్టేబుళ్లు తెరవెనక్కి వెళ్లిపోగా, డ్రైవర్ నరేష్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటన తర్వాత ప్రాణభయంతో తాను ఆర్టీసీ బస్సెక్కి నేరుగా ఏలూరు చేరుకున్నానని.. కొద్దిసేపు బస్ కాంప్లెక్స్‌లో ఉండిపోరుు ఆ తరువాత పోలీస్ స్టేషన్‌కు వచ్చానని చెప్పిన డ్రైవర్ నరేష్ కథనంపై ఆ రోజే అనుమానాలు తలెత్తాయి. అందుకే పోలీసులు ఆ రోజు నరేష్‌ను మీడియాతో మాట్లాడ నివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
 
 సీసీ టీవీ పుటేజ్‌తో..
 హత్యలు జరిగిన రోజు పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద హతుల కారు, హంతకుల కారుతోపాటు మరో వాహనం వెంబడించిందని విజయవాడ పోలీసులు గుర్తిం చారు. ఇదే విషయూన్ని సీసీ టీవీ పుటేజ్ స్పష్టం చేస్తోందని సమాచారం. ఘటనా స్థలానికి చుట్టుపక్కల గ్రామాలకు చెంది న వారు కూడా ఒకదాని వెనుక ఒకటి వరుసగా మూడు కార్లు వెళ్లాయన్న సమాచారం మేరకు  విజయవాడ పోలీ సులు ఆ మూడో కారు ఎవరిదని ఆరా తీశారు. సీసీ టీవీ పుటేజ్‌లో ఎస్‌వీఆర్ ట్రావెల్స్ వాహనాలు రెండు ఉండటంతో అనుమానం వచ్చి ముందుగా ట్రావెల్స్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో ఆయన తాను మరో వాహనాన్ని పంపానని జరిగిందంతా వివరించాడు. దీంతో విజయవాడ పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రెండురోజుల కిందట ఏలూరు నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం ఇక్కడి నుంచి సీఐని, ఇద్దరు ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను విచారణ నిమిత్తం తీసుకువెళ్లారు. పక్కా సమాచారంతో సీఐని, ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని ముగ్గురి ఫోన్లను, సీఐ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
 
 సీఐకి సంబంధం ఏమిటో..
 పినకడిమికి చెందిన ముగ్గురి హత్యల కేసు నగర పోలీస్ సర్కిల్ పరిధిలోది కాదు. ఏప్రిల్ 6న పినకడిమిలో భూతం దుర్గారావు హత్య కేసు సైతం పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. కానీ.. గంధం నాగేశ్వరరావు ఏలూరులోని సీఐని కలిసి రక్షణ కల్పించమని కోరడం అనుమానాలకు తావిస్తోంది. సెప్టెంబర్ 1న కేసు వాయిదా నిమిత్తం గంధం నాగేశ్వరరావు వర్గీయులు ఏలూ రు వచ్చినప్పుడు కూడా రూ.25 వేలు తీసుకుని ఇదే సీఐ కానిస్టేబుళ్లను రక్షణగా పంపించినట్టు సమాచారం. తనకు సంబంధం లేని కేసులో నిందితులకు భద్రత కల్పించాల్సిన అవసరం నగర పరిధిలోని సీఐకు ఎందుకొచ్చింది.. పోనీ కల్పించినా వారు ప్రయాణిస్తున్న కారులో కాకుండా ఐడీ కానిస్టేబుళ్లను వేరే కారులో ఎందుకు పంపించారన్న దానిపై పలు సందేహాలు తలెత్తు తున్నాయి. ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను భద్రత నిమిత్తం పంపించిన విషయూన్ని కనీసం హత్యలు జరిగిన తరువాత అరుునా సదరు సీఐ ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకు వెళ్లలేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

మరిన్ని వార్తలు