ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయండి

10 Oct, 2013 00:58 IST|Sakshi

రాష్ట్రపతి పాలన పెట్టండి.. గవర్నర్‌కు టీఆర్‌ఎస్ వినతిపత్రం
 సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణ


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమస్యలకు కారణమైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ నరసింహన్‌ను టీఆర్‌ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ నేతృత్వంలో ఎంపీలు మందా జగన్నాథం, జి.వివేక్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కె.హరీశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, కె.తారక రామారావు, సోమారపు సత్యనారాయణ, ఎం.బిక్షపతి, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితరులు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సీఎంపై కేబినెట్ మంత్రులకు విశ్వాసం లేదని తెలిపారు. డిప్యూటీ సీఎం తెలంగాణకు చెందిన కేబినెట్ మంత్రులంతా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించకపోగా మరింతగా దిగజారే పరిస్థితులను కల్పిస్తున్నాడని గవర్నరుకు వారు ఫిర్యాదు చేశారు.

శాంతిభద్రతలు క్షీణించడానికి సీఎం ఒక ప్రాంతానికి అనుకూలంగా పనిచేస్తూ ఏపీఎన్‌జీవోల సమ్మెను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సర్వీసుకు సంబంధంలేని అంశాలపై ఏపీఎన్‌జీవోలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్‌కు వివరించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా నివేదికలను, ప్రకటనలను ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి చేసిన ప్రకటనను గవర్నరుకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలిజం పెరుగుతుందంటూ నివేదికలను ఇవ్వాలని దినేశ్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు సీఎం ఆదేశించడం..  భూకబ్జాలకు, అవినీతికి, అక్రమాలకు మద్దతును ఇవ్వాలని కోరడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసేవిధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటు సంక్షోభం తీవ్రమైనా ప్రభుత్వ పరంగా చర్యలేమీ తీసుకోకుండా గ్రిడ్‌లను దెబ్బతీసే విధంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి సంక్షోభానికి కారణమైన ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలననను విధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ

వారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది: సీఎం జగన్‌

‘నాలుగు పంపుహౌస్‌ల్లో ఒకటే పనిచేస్తోంది’

‘ఐఐటీ తిరుపతి అభివృద్దికి సహకరించండి’

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి

ఈనాటి ముఖ్యాంశాలు

పెట్టుబడులు ఎక్కడ చంద్రబాబు? : అవంతి

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి

జెండా వందనం చేసే మంత్రులు వీరే!

‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’

పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ

ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వకు గండి

రాపాక అరెస్ట్‌.. రాజోలులో హైడ్రామా

త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌

అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్‌

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌.. పూర్తిస్థాయి నియామకం

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పథకాల అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

నవ వధువు అనుమానాస్పద మృతి..!

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌

మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన రాఖీసావంత్‌

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌