టీఆర్‌ఎస్‌కు పది సీట్లు మించిరావు: విజయశాంతి

5 Aug, 2013 17:42 IST|Sakshi
టీఆర్‌ఎస్‌కు పది సీట్లు మించిరావు: విజయశాంతి

వచ్చే 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)పార్టీకి పది సీట్లు మించి రావని మెదక్ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. సోమవారం 'సాక్షి'తో మాట్లాడిన విజయశాంతి పలు విషయాలను వెల్లడించారు. ఉద్యమంలో క్రెడిట్ అంతా కేసీఆర్ అంటే తాను ఒప్పుకోనని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమం నడవడానికి అనేక మంది తెలంగాణ వాదులు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకు షోకాజ్ నోటీస్ అందిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని విజయశాంతి తెలిపారు.

తెలంగాణ సాధన టీఆర్‌ఎస్ గొప్పదనమే అని చెప్పకపోగా, తెలంగాణ అమరవీరులదే ఆ ఘనత అని విజయశాంతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. టీఆర్‌ఎస్ అధినాయ కత్వంతో ఆమెకు దూరం పెరిగిందనేది స్పష్టమ వుతోంది. కాగా తెలంగాణ ఏర్పాటుకోసం టీఆర్‌ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానని గతంలోనే ఆమె చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఘనత ఏ రాజకీయపార్టీదో కాదని, ప్రాణాలను అర్పించిన అమరవీరులదే అని వ్యాఖ్యానించారు.

అధికార రాజకీయాల చుట్టూ తిరిగే పార్టీలకు తాను క్రెడిట్ ఇవ్వదలచుకోలేదని, త్యాగాలు చేసిన అమరులకే క్రెడిట్ ఇస్తానని అన్నారు. తెలంగాణ కోసం తాను 16 ఏళ్లుగా కష్టపడ్డానని, టీఆర్‌ఎస్ 13 ఏళ్లుగానే, పోరాడుతోందని అన్నారు. తెలంగాణకోసం  టీఆర్‌ఎస్ కంటే తానే ఎక్కువగా కష్టపడ్డానన్నారు. 2014 ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయంపై ఇప్పుడే మాట్లాడలేనన్నారు.

>
మరిన్ని వార్తలు