కొండపై రాజకీయం

29 May, 2019 04:02 IST|Sakshi
తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న పుట్టా

అర్ధాంతరంగా ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం

దర్శన టికెట్ల కోసం టీటీడీ బోర్డు సభ్యుల రగడ

సమావేశాన్ని బహిష్కరించిన ఈవో, జేఈవో

పది నిమిషాల్లోనే సమావేశం ముగింపు

తాను రాజీనామా చేయబోనన్న చైర్మన్‌ పుట్టా

కొత్త ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని వెల్లడి

సాక్షి, తిరుపతి/తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యుల పాచిక పారలేదు. పది మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇప్పించడం, కాంట్రాక్టు పనులు దక్కించుకోవడం కోసం ఏర్పాటు చేస్తున్నారంటూ విమర్శల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం చివరకు అర్ధంతరంగా ముగిసింది. టీటీడీ ఈవో, జేఈవో సమావేశాన్ని బహిష్కరించడంతో సభ్యుల వ్యూహం బెడిసికొట్టింది. తర్వాత పది నిముషాల్లో చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్, సభ్యులు కూడా సమావేశాన్ని ముగించారు. టీటీడీ అధికారుల తీరుకు నిరసనగా పాలకమండలి సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చైర్మన్‌ పుట్టా చెప్పారు.  

తిరుమల జేఈవోపై విమర్శలు 
గత ప్రభుత్వం హయాంలో నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తిరుమల అన్నమయ్య భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సమావేశం ప్రారంభం కాగానే తిరుమల జేఈవోపై పలువురు బోర్డు సభ్యులు దర్శన టికెట్లకోసం విమర్శలు చేయడంతో రసాభాసగా మారింది. దీంతో జేఈవో శ్రీనివాసరాజు బయటకు వచ్చేశారు. టికెట్ల విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అలాంటి విషయాలు జేఈవో పరిధిలోనిది అని బోర్డు సభ్యులకు ఈవో ఎకె సింఘాల్‌ వివరించారు.

అనంతరం సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా బయటకు వచ్చారు. తర్వాత బోర్డు సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి బయటకు వచ్చి తన రాజీనామా లేఖను ఈవోకు ఇచ్చి వెళ్లిపోయారు. మరో పది నిమిషాల తర్వాత బోర్డు చైర్మన్‌ పుట్టా కూడా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు పాలకమండలి కొనసాగుతుందని చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. రాజీనామా చేసే యోచన తమకు లేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే తాము నడుచుకుంటామని తెలిపారు. అంతవరకు టీటీడీ చైర్మన్‌ పదవిని వదిలే ప్రసక్తే లేదని చెప్పడం గమనార్హం.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సమాన స్థాయిలో టూరిజం అభివృద్ధి..

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం..

ఈనాటి ముఖ్యాంశాలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మేజర్‌ జనరల్‌

కొత్త రాజ్‌ భవన్‌ను పరిశీలించిన గవర్నర్‌ కార్యదర్శి

హోదాపై కేంద్రాన్ని నిలదీసిన మిథున్‌ రెడ్డి

వైఎస్సార్‌ హయాంలోనే చింతలపుడి ప్రాజెక్టు

అడ్డంగా దొరికి.. పారిపోయి వచ్చారు

సీఎం జగన్‌పై లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు

పని చేస్తున్న సంస్థకే కన్నం

మృత్యువులోనూ వీడని బంధం

ఏపీలో రాజ్‌భవన్‌కు భవనం కేటాయింపు

ఎక్కడికెళ్లినా మోసమే..

పసుపు–కుంకుమ నిధుల స్వాహా!

ఏళ్లతరబడి అక్కడే...

గంటపాటు లిఫ్టులో నరకం

పేదల ఇంట 'వెలుగు'

కులం పేరుతో దూషించినందుకు ఐదేళ్ల జైలు

చంద్రబాబుపై సెటైర్లు.. సభలో నవ్వులు..!

చేయి చేయి కలిపి...

పని చేస్తున్నసంస్థకే కన్నం

స్కూటీ.. నిజం కాదండోయ్‌

బస్సుల కోసం విద్యార్థుల నిరసన

రెవెన్యూలో అవినీతి జలగలు.!

అల్లుడిని చంపిన మామ

అక్రమ కట్టడాల తొలగింపుపై చర్చించడమా?

చినుకు పడితే చెరువే..

బాపట్లవాసికి జాతీయ అవార్డు!

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: బొత్స

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం