టీటీడీ కీల‌క నిర్ణ‌యం: ఆస్తుల‌పై శ్వేత‌ప‌త్రం

28 May, 2020 21:03 IST|Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో కీలక నిర్ణయం నిర్ణ‌యం తీసుకున్నారు. టీటీడీ ఆస్తుల మీద వెంట‌నే శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స్వామి వారి భూమి ఇంచు కూడా ఆక్ర‌మ‌ణ‌కు గురి కాకూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో వివిధ ద‌శ‌ల్లో విక్ర‌యించిన‌వి, దురాక్ర‌మ‌ణ‌కు గురైన భూముల వివ‌రాలు శ్వేత‌ప‌త్రంలో ఉండాల‌ని పేర్కొన్నారు. వాటితోపాటు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌వి, దురాక్ర‌మ‌ణ‌కు గురైన‌వి స్వాధీనం చేసుకున్నవీ అందులో పొందుప‌ర‌చాల‌ని స్ప‌ష్టం చేశారు. (టీటీడీ బోర్డు సమావేశం, ఉమాపతికి సంతాపం)

అంతేకాక‌ 2016 నుంచి అప్పటి పాలక మండలి విక్రయాల మీద ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలంటూ లేఖ వ్రాయాలని టీటీడీ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా నేడు టీటీడీ పాల‌క‌మండలి కీల‌క స‌మావేశం నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా టీటీడీ భూములు విక్ర‌యించ‌రాద‌ని తీర్మానం చేసింది.నేడు జ‌రిగిన‌ పాలక మండలి సమావేశంలో టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం చేసిన విష‌యం తెలిసిందే. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం నిర్వహించారు. (టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం)

చ‌ద‌వండి: వెంకన్న సాక్షిగా.. పాపాలన్నీ బాబువే

మరిన్ని వార్తలు