టీవీ5పై చర్యలు తీసుకుంటాం: వైవీ సుబ్బారెడ్డి

25 Jul, 2019 12:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన టీవీ5 ఛానల్‌ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ డీఈవోగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రిస్టోఫర్‌ను టీటీడీ డీఈవోగా నియమించారంటూ టీవీ5 ఛానల్‌ తన వెబ్‌సైట్లో తప్పుడు వార్తలు పెట్టి భక్తులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీవీ5 ఛానల్‌ వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. కేసు కూడా పెడతామని హెచ్చరించారు. టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తోన్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారని సుబ్బా రెడ్డి మండి పడ్డారు.

ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారిందని విమర్శించారు. అబద్ధాలు, దుష్ప్రచారాలతో ప్రభుత్వ ప్రతిష్టను, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాను వాడుకొని ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సుబ్బా రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు