టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

16 Jul, 2020 11:29 IST|Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు నిత్యం యథావిధిగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా కట్టడి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా, భక్తుల సహకారం వల్ల దర్శనాలు నిరంతరం కొనసాగుతాయని భావిస్తున్నామన్నారు. ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించామని తెలిపారు. తిరుచ్చి శ్రీరంగపట్నం ఆలయం నుండి నుండి స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

శ్రీవారి ఆలయంలో 14 మంది అర్చకులకు కరోనా..
తిరుమల శ్రీవారి ఆలయంలో 14 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో అర్చకులు సమావేశమయ్యారు. 60 ఏళ్లకు పైబడిన అర్చకులు కోరితే రిలీవ్ వెసులుబాటు, టీటీడీ అనుబంధ ఆలయాల నుంచి అర్చకులను పిలిపించి శ్రీవారి కైంకర్యాలు నిర్వహించే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు