కరోనా తగ్గాలని ధన్వంతరి యాగం చేశాం: టీటీడీ

25 Apr, 2020 14:45 IST|Sakshi

సాక్షి, తిరుపతి: కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే శ్రీవారి దర్శనాలు నిలిపివేశామని తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టాలను తొలగించాలని ధన్వంతరి యాగం చేశామని చెప్పారు. లాక్‌డౌన్‌లో ఉన్న భక్తుల కోసం వేద పారాయణం లైవ్‌టెలికాస్ట్‌ చేయిస్తున్నామన్నారు. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ శ్రీవారి ఆలయం ఇన్ని రోజులు మూయలేదని చెప్పారు. దాదాపు 45 రోజులుగా శ్రీవారి దర్శనాలు నిలిపివేశామన్నారు. (రూ.300 కోట్లకు పైగా ఆదాయాన్ని కోల్పోయిన టీటీడీ)

ఇక రాబోయే బ్రహ్మోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో భక్తులకు అనుతించే అవకాశం లేదని స్పష్టం చేశారు. వైకుంఠ క్యూకాంప్లేక్స్‌ల్లో మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్నప్రసాదం ద్వారా రోజుకు దాదాపు లక్షా 20 వేల మందికి భోజనం అందిస్తున్నామన్నారు. ఇక టీటీడీ గోశాల నుంచి ప్రశుగ్రాసం అందిస్తున్నామని, దేవాలయాల్లో కైంకర్యాలు అన్నీ యథాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు శ్రీవారి కల్యాణోత్సవం నిరవ్వహిస్తున్నామని చెప్పారు. కాగా కరోనాపై సోషల్‌ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని వైవీ సూచించారు.

మరిన్ని వార్తలు