టీటీడీ బకాయిలు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

28 Sep, 2019 16:27 IST|Sakshi

సాక్షి, తిరుమల: 2004 నుంచి 2018 వరుకు టీటీడీకి బకాయి ఉన్న 5 లక్షల పదివేల రూపాయల బిల్లులను ఏపీ ప్రభుత్వం క్లియర్‌ చేసింది. 2004 నుంచి పట్టు వస్త్రాల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ శనివారం ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చే పట్టు వస్త్రాల బిల్లులను గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచాయి. 2019 వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.70వేలతో శ్రీవారికి  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాన్ని సమర్పించనున్నారు.

ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 9 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ప‌కడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని వార్తలు