ఉద్యోగం పోయిందన్నా..

10 Dec, 2018 07:54 IST|Sakshi

శ్రీకాకుళం :తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయంలో పనిచేసే నన్ను వివాహ సమయంలో కొన్నిరోజులు సెలవు పెట్టడంతో అన్యాయంగా తొలగించారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నాను. ప్రస్తుతం టీటీడీలో విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరించారు. నా ఉద్యోగం ఇప్పించమని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నా.. మీరే న్యాయం చేయాలి.
–  పి.కనక దుర్గమహాలక్ష్మి, రాగోలు, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు