టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

12 Jul, 2020 16:38 IST|Sakshi

ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై పూర్తి అధ్యయనం తర్వాత శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతం బ్రహ్మోత్సవాలకు టెండర్లు పిలిచామని ఈవో వెల్లడించారు. వివాదాలకు తావులేకుండా పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే శ్వేత పత్రం విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్‌ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

కాగా, తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి హుండిలో ఓ అజ్ఞాత భక్తుడు బంగారు బిస్కెట్లు విరాళంగా వేశారు. ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్న 20 బంగారు బిస్కెట్లను సమర్పించిన విషయం వెలుగు చూసింది.
 

మరిన్ని వార్తలు