సుధా నారాయణమూర్తిపై అసత్య ప్రచారం

6 Jun, 2020 17:23 IST|Sakshi

టీటీడీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, తిరుమల: టీటీడీ బోర్డు సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి రాజీనామా చేశారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. సుధా నారాయణమూర్తిపై ఫేస్‌బుక్‌లో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. దాంతోపాటు శ్రీవారి ఆలయ చరిత్ర, టీటీడీపై దుష్ప్రచారం చేసిన మరో 8 మందిపై కూడా కేసులు పెట్టామని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేల వ్యవహరించిన వారిపై చర్యలకు వెనకాడేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
(చదవండి: తిరుపతి: 11 నుంచి దర్శనాలకు అనుమతి..)

కాగా, తమిళ నటుడు శివకుమార్‌ ఓ వీడియోలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేశారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అసత్య ప్రచారం చేశారు. తిరుమలకు వెళ్లొద్దంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. దీనిపై శ్రీవారి భక్తుడు తమిళ్ మయ్యన్ శివ కుమార్‌పై టీటీడీకి సమాచారం ఇచ్చారు. టీటీడీపై శివకుమార్‌ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జూన్ 30 వరకు శ్రీవారి దర్శనాలు రద్దు అంటు సోషల్‌ మీడియా, పత్రికలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై, రెండు పత్రికలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ తెలిపింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ద్వారా వీరిపై కేసు నమోదైంది.

ఫేస్‌బుక్‌ పేజీపైనా కేసు: డీఎస్పీ
శ్రీవారి ఆలయం, భక్తుల‌పై వివాదస్పద పదజాలం వాడిన తమిళ నటుడు శివకుమార్‌పై కేసు నమోదు చేసినట్టు తిరుమల డిఎస్పీ ప్రభాకర్ బాబు తెలిపారు. టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.. తెలుగు ఎతిస్ట్ ఫేస్ బుక్ పేజీపైనా కేసు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
(చదవండి: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మరో కేసు)

మరిన్ని వార్తలు