తిరుమల సమాచారం

27 Apr, 2015 05:25 IST|Sakshi
తిరుమల సమాచారం

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 59,793 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అదే సమయానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. వీరికి 18 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల్లోస్వామివారి దర్శనం లభించనుంది.

రద్దీ కారణంగా గదుల కోసం మూడు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పించుకునేందుకు రెండు గంటలు వేచి ఉన్నారు.తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లూ నిండిపోయాయి.

 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - 12 ఖాళీగా ఉన్నారుు
 రూ.50 గదులు -  ఖాళీ లేదు
 రూ.100 గదులు - 8 ఖాళీగా ఉన్నాయి
 రూ.500 గదులు - 2 ఖాళీగా ఉన్నాయి
 తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా ఆర్జితసేవలన్నీ రద్దు చేశారు.

మరిన్ని వార్తలు