రథసప్తమి నాడు సప్తవాహనాలపై శ్రీవారు

21 Jan, 2020 18:33 IST|Sakshi

సాక్షి, తిరుమల: తిరుమలలో సూర్యజయంతిని రథసప్తమిగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓ ధర్మారెడ్డి అన్నారు. రథసప్తమిపై టీటీడీ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1న రథసప్తమిని నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ వేడుక కోసం నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.
చదవండి: శ్రీవారి భక్తులకు తీపి కబురు

రథసప్తమి నాడు సప్త వాహనాలపై శ్రీవారి ఊరేగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుక పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం రోజు సుమారు 55, 689 ఉచిత లడ్డులను భక్తులకు అందించామని తెలిపారు. భక్తులు అదనంగా 1,59,814 లడ్డూలు విక్రయించారని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. 
చదవండి: గదుల బుకింగ్‌లో కాషన్‌ డిపాజిట్‌ విధానం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’

బాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క

మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ

ఏమయ్యా పవన్‌నాయుడు అది నోరా.. లేక

ప్రతీ పిల్లాడికి ఒక కిట్‌: సీఎం జగన్‌

సినిమా

అయితే వారిద్దరి ప్రేమాయణం నిజమా..?!

లస్సీలో తేనెటీగ పడినా తాగాను: షారుక్‌

రూ. 200 కోట్ల క్లబ్‌లో ‘దర్బార్‌’

సైఫ్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు!

అదే గొప్ప ఆస్తి: కాజోల్‌

సామజవరగమన పాటకు కేటీఆర్‌ ఫిదా