ఆలయ ప్రతిష్ట దెబ్బతీయడం భావ్యం కాదు

22 Jun, 2018 19:49 IST|Sakshi
టీటీడీ జేఈఓ శ్రీనివాస రాజు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, తిరుమల : గత కొంతకాలంగా టీటీడీ పాలకమండలిపై రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలపై జేఈఓ శ్రీనివాస రాజు స్పందించారు. ప్రసాదం పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదనీ, ఆగమ శాస్త్ర పండితుల సలహాల మేరకే మరమ్మతు పనులు చేశామని చెప్పారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రీవారి ఆశిస్సులతో సుదీర్ఘ కాలంగా ఈ పదవిలో ఉన్నానని అన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేల వస్తున్న అసత్య ఆరోపణలుపై వివరణ ఇవ్వడం తన బాధ్యత అని తెలిపారు.

ఆగమ శాస్త్ర సలహామండలి సూచనల మేరకే ప్రసాదం పోటులో మరమ్మతులు చేశామని వెల్లడించారు. అందుకనే ప్రసాదాలను పడి పోటులో తయారు చేశామని తెలిపారు. ఒక సందర్భంలో రమణదీక్షితులు అంగీకారం తెలపకపోవడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు చెయ్యలేదని అన్నారు. సలహామండలిలో గల అయిదురు సభ్యుల్లో దీక్షితులు ఒకరని.. శ్రీవారి సన్నిదిలో ఏదో అపకార్యం జరదిగిందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. మరమ్మతులు చేయకుండా వదిలిపెడితే..! ఏదైనా ప్రమాదం జరిగితే.. బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆలయంలో జరిగే పూజా కైంకర్యాల నిర్వహణలో అధికారుల ప్రమేయం ఏమాత్రం ఉండదనీ, అటువంటప్పుడు కార్యక్రమాల నిర్వహణలో తొందర పెట్టారని దీక్షితులు ఆరోపించడం భావ్యం కాదని అన్నారు. అయినా, 22 గంటల పాటు భక్తుల సంచారం ఉండే ఆలయంలో భక్తులకు తెలియకుండా ఏం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం అభరణాల తనిఖీలు జరుగుతాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు