భక్తులకు టిటిడి పాలకమండలి వరాలు

11 Nov, 2013 21:29 IST|Sakshi
భక్తులకు టిటిడి పాలకమండలి వరాలు

తిరుమల: భక్తులను దృష్టిలో పెట్టుకుని టిటిడి పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. కాలినడకన వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి నుంచి ఉచిత లడ్డు ఇవ్వాలని ఈరోజు జరిగిన పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి టీటీడీ కాటేజీలలోనే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయాలని తీర్మానించింది.  

ఈ రోజు సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణయాలు:

* 3.75 కోట్ల రూపాయలతో తిరుచానూరు ఆలయానికి మరమ్మతులు
* ఈ నెల 15న 22వేల ఆలయాలలో మనగుడి కార్యక్రమం నిర్వహణ.
* బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం. 10,  5 వేల రూపాయల చొప్పున బహుమతులు.
* తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్‌గా నిర్ణయించాలని కేంద్రాన్ని మరోమారు కోరాలని  పాలక మండలి నిర్ణయం.

ఇదిలా ఉండగా,  కేరళ హైకోర్ట్ తీర్పు ప్రకారం సమాచార హక్కు టీటీడీకీ వర్తించదని టిటిడి ఇఓ చెప్పారు.

మరిన్ని వార్తలు