శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

6 May, 2016 11:56 IST|Sakshi

తిరుమల: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 49,046 టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో www.ttdseva-online.com వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు.

సేవా టికెట్లు వివరాలు:
సుప్రభాతం 6,157
తోమాల 140
అర్చన 140
విశేషపూజ 750
అష్టదళపాదపద్మారాధన 80
నిజపాద దర్శనం 1,115
కల్యాణోత్సవం 10,874
ఊంజల్‌సేవ 2,900
వసంతోత్సవం 6,880
ఆర్జిత బ్రహ్మోత్సవం 6,235
 సహస్రదీపాలంకరణ సేవ 13,775

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు