టీటీడీ చదువుకు భలే డిమాండ్‌

16 May, 2019 11:52 IST|Sakshi
ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాల భవనం

పోటా పోటీగా దరఖాస్తు చేస్తున్నవిద్యార్థులు

25తో ముగియనున్న తుదిగడువు

చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్‌: పదవ తరగతి ఫలితాలు మంగళవారం విడుదల కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్‌ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టీటీడీ డిగ్రీ, ఇంటర్‌ కళాశాలల్లో 2019–20 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం గత నెల 25 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ చేరే వారు ఇప్పటికే  చాలా మంది దరఖాస్తు చేయగా, మంగళవారం టెన్త్‌ ఫలితాల విడుదలతో ఇంటర్‌లో చేరదలచిన వారు దరఖాస్తుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూసే టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశ నోటిఫికేషన్‌ ఈ యేడాది త్వరగా విడుదల అయింది. దరఖాస్తు ప్రక్రియ గత నెల 25 నుంచే  ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసేకొనే అవకాశం కల్పించారు.

రెండు ఇంటర్‌ కళాశాలలు
టీటీడీ పరిధిలో ఎస్వీ జూనియర్‌ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాల ఉన్నాయి. ఇందులో పద్మావతి జూనియర్‌ కళాశాలో బాలికలకే అడ్మిషన్లు ఇస్తారు. ఎస్వీ జూనియర్‌ కళాశాలలో బాలబాలికలకు ఇరువురికి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. శ్రీ పద్మావతి జూనియర్‌ కళాశాలలో 9 గ్రూపుల్లో 968 సీట్లు అందుబాటులో ఉన్నా యి. అడ్మిషన్‌ పొందిన వారిలో 450 మందికి హాస్టల్‌ వసతి కల్పిస్తారు. ఎస్వీ జూనియర్‌ కళాశాలలో 12 గ్రూపుల్లో 792 సీట్లు ఉన్నాయి. అడ్మిషన్‌ పొందిన వారిలో 350 మందికి హాస్టల్‌ వసతి ఉం ది. 20 కిమీ కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చిన వారికి మాత్రమే హాస్టల్‌ వసతి కల్పిస్తారు. పదవ తరగతిలో సాధిం చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం తక్కువగా ఉన్న వారి పిల్లలకు సైన్స్‌ కోర్సులకు 946 రూపాయలు, ఆర్ట్స్‌ గ్రూపులకు 394 రూపాయలు చెల్లించాలి.

డిగ్రీ కళాశాలలకు..
టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జీఎస్‌ డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అందుబాటులో ఉన్నాయి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో 26 గ్రూపుల్లో 1295 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 900 హాస్టల్‌ సీట్లు ఉన్నాయి. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలో 22 గ్రూపుల్లో 1177 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 600 మందికి మాత్రమే వసతి కల్పిస్తారు. ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలలో 17 గ్రూపుల్లో 870 సీట్లు ఉన్నాయి. కళాశాలలో చేరిన వారిలో 400 మందికి మాత్రమే హాస్టల్‌ వసతి ఉంది. ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్‌ కల్పిస్తారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులు 1,625 రూపాయలు ఫీజు రూపంలో చెల్లించాలి.

దరఖాస్తు చేసుకునే విధానం
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో చేరదలచిన వారు admission.tirumala.org బ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.ఇంటర్,కోర్సులకు  కావాల్సిన ∙ఆప్షన్లు ఇచ్చుకోవాలి. తమ వివరాలతోపాటు, కావాల్సిన కళాశాల,  కోర్సులకు ఆప్షన ్లు  ఇచుకోవాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చుకున్న ఆప్షన్ల మేరకు మెరిట్‌ ప్రకారం దరఖాస్తు తుది గడువు తర్వాత సీటు  కేటాయిస్తారు. దరఖాస్తు తుది గడువును ఈ నెల 25గా ప్రకటించారు.

ప్రతిభకే పట్టం
ఈ విద్యా సంస్థల్లో ప్రతిభ కల్గిన విద్యార్థులకే అడ్మిషన్‌ అవకాశం ఉంది. 2015–16 విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే వారు. అయితే ఈ యేడాది కొత్త విధానం తీసుకొచ్చారు. ఎంసెట్‌ తరహాలో విద్యార్థులు తాము కోరుకుంటున్న కళాశాల, గ్రూపులను ఆప్షన్లుగా ఇచ్చుకోవాలి. వీరు ఇచ్చుకున్న ఆప్షన్ల ఆధారంగా తుది గడువు ముగిశాక, సీట్లను కేటాయించి విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ పంపుతారు. ఎస్‌ఎంఎస్‌ అందుకున్న విద్యార్థులు సంబంధిత కళాశాలకు వెళ్లి తమ సర్టిఫికెట్లు చూపించి అడ్మిషన్‌ పొందవచ్చు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌ 

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

అరకులోయలో మహిళా డిగ్రీ కళాశాల

నిధులు చాలక..నత్తనడక

ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలు రద్దు

7 నుంచి చెన్నై సంత్రాగచ్చి వీక్లీ స్పెషల్‌

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

దివిసీమలో గాలివాన బీభత్సం

ధర్నాలతో దద్దరిల్లిన కాకినాడ కలెక్టరేట్‌

ఈ బండి.. తోస్తే గానీ కదలదండీ !

పెన్సిల్‌ ముల్లుపై షిర్డీసాయిబాబా 

గురుభ్యోనమః

ఉపాధ్యాయుడి పైశాచికత్వం

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

డ్రైఫ్రూట్‌ కిళ్లీ@ చీరాల

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

సింహగిరి.. భక్తఝరి

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు

టీడీపీ ప్రభుత్వం నిండా ముంచింది..

ఎవరైనా బీజేపీలో చేరొచ్చు

ఆహాఏమిరుచి..అనరామైమరచి

గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్‌..!

కర్కశత్వానికి చిన్నారుల బలి

జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

విశాఖలో టీడీపీ పంచాయితీ

తిన్నది.. కరిగిద్దామిలా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌

రష్మికా మజాకా