జీతాలపెంపునకు రైట్‌ రైట్‌

29 Aug, 2018 11:54 IST|Sakshi
అన్నమయ్య భవన్‌లో సమావేశమైన పాలకమండలి, అధికారులు

టీటీడీ రవాణా ఉద్యోగులకు వేతనాలు పెంపు

ఆహార ధరల పర్యవేక్షణకు కమిటీ

గోవర్దన సత్రం సమీపంలో రూ.79 కోట్లతో వసతి     సముదాయ నిర్మాణం

చర్చకు రాని ‘ఎమ్మెల్యే అవమాన’అంశం

ఉద్యోగుల వినతిపై దాటవేత వైఖరి

టీటీడీ ధర్మకర్తల మండలి భేటీ

తిరుమల : టీటీడీ రవాణా శాఖ విభాగంలో 65 మంది డ్రైవర్లు, 15 మంది íఫిట్టర్ల జీతం పెంచాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.  మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది.  పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
టీటీడీ రవాణా విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు వేతనం రూ.15వేల నుంచి రూ.24,500 లకు, 28 మంది క్లీనర్లకు  వేత నం రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంపు.
తుళ్లూరు మండలం వెంకటపాళెం వద్ద రూ.150 కోట్లతో శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి ఆమోదం.
తిరుమలలోని గోవర్దన సత్రం సమీపంలో నూతన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు.
రాష్ట్రంలోని 142 గ్రంథాలయాలకు 2,200 ఆధ్యాత్మిక ప్రచురణలు  ఉచితంగా సరఫరా.
ఫాస్ట్‌ఫుడ్, టీæ, టిఫిన్‌ సెంటర్లలో ఆహారపదార్థాల ధరలను సమీక్షించేందుకు ఐదుగురు  అధికారులతో కమిటీ. కమిటీ నివేదికను  బోర్డుకు సమర్పిస్తుంది.
శ్రీవారి సేవాసదన్‌–1, 2 భవనాలు,వకుళాదేవి విశ్రాంతిగృహం, పీఏసీ–3 కలిపి 3 సంవత్సరాలకు ఎఫ్‌ఎంఎస్‌ నిర్వహణ కోసం రూ.19.50 కోట్లతో టెండర్లు ఖరారు.
ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి సముదాయం భవనం ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖకు అప్పగింత.
కల్యాణమండపాల్లో అభివృద్ధి పనులకు  రూ.37.05 కోట్లు మంజూరు.

సీఎం సిఫారసుకు చెక్‌
టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతోందని ఇటీవల ఉద్యోగులు  అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.  వినతిపత్రంపై సంతకం చేసిన వారిలో టీటీడీ చైర్మన్‌ సహాయకుడు కూడా ఉన్నారు. ఇప్పుడు చర్చిస్తే ఆయనపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చైర్మన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా ముగించినట్లు తెలిసింది. పాలకమండలి సభ్యులు  చర్చ జరగాలని పట్టుపట్టినా చైర్మన్‌ వినతిపత్రం ఇచ్చిన అందరిపై చర్యలు తీసుకోవాలని చాకచక్యంగా సమావేశాన్ని ముగించారు. ఈ అంశం వల్ల సీఎం సిఫారసులకు చెక్‌పడింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో సహా నేతలంతా తాము చెప్పిన చోట  కల్యాణమండపాలు నిర్మించాలని టీటీడీకీ సిఫారసు చేశారు.  ఉద్యోగస్తులు రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ మారుతుందనే ఉద్యోగుల వాదన నేపథ్యంలో ఈ సిఫార్సుకు బ్రేక్‌ పడింది. దీనిపై మండలి వెనకడుగేసింది.  ఆరునెలల వరకు నిర్మాణాలు చేపట్టమని టీటీడీ ఈఓ స్పష్టం చేశారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ సమయంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు ఆహ్వానం అందలేదని సంప్రోక్షణ సమయంలో ఆలయం ఎదుట  చైర్మన్‌తో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చ జరగలేదు. ఇది మరోమారు ఎమ్మెల్యేను టీటీడీ అవమానపరచినట్లేనని ఆమె వర్గీ యులు మండిపడుతున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు