అర్థరాత్రి వరకు దర్శన టికెట్ల బుకింగ్!

30 Jun, 2015 08:00 IST|Sakshi
అర్థరాత్రి వరకు దర్శన టికెట్ల బుకింగ్!

తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో జారీ చేస్తున్న రూ.300 ఆన్‌లైన్ ప్రత్యేక దర్శన టికెట్లను ఇకపై అర్థరాత్రి 12 గంటల వరకు బుక్ చేసుకునేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఈవో సాంబశివరావు వెల్లడించారు. ప్రస్తుతం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను రాత్రి 7 గంటల వరకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు.

అయితే భక్తుల సౌకర్యార్థం ఈ మార్పుపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానంలో వచ్చే సూచనలు అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే అమలులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా