ఏప్రీల్‌ 1నుంచి 11వరుకు సీతారాముల కళ్యాణం

28 Jan, 2020 14:12 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరంలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు నిర్వహించనున్నారు. ఏప్రీల్‌ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ అంగరంగ వైభవంగ నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం 11వ తేదీన పుష్పయాగం, ఏకాంత సేవతో ముగియనున్నాయి. 

 • 1వ తేదీనాడు సీతారామలక్షణులకు వ్యాసాభిషేకం చేస్తారు.
 • 2వ తేదీన ఉదయం ద్వాజారోహనం, రాత్రి శేష వాహనం
 • 3న ఉదయం వేణుగాన అలంకారం రాత్రి హంస వాహనం
 • 4న ఉదయం వటపత్రా సాయి  అలంకారం రాత్రి  సింహవాహనం 
 • 5న ఉదయం వవనీత కృష్ణ అలంకారం రాత్రి హనుమంత సేవ 
 • 6న ఉదయం మోహిని అలంకారం రాత్రి గరుడసేవ 
 • 7న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కళ్యాణం మహోత్సవం
 • 8న రథోత్సవము
 • 9న ఉదయం కాళీయమర్దన అలంకారం రాత్రి అశ్వవాహనం
 • 10న  ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజావరోహణం
 • 11న సాయంత్రం పుష్పయాగం రాత్రి ఏకాంత సేవతో 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు