ఓ మై గాడ్‌... వెంకన్న రక్షించాడు

5 Mar, 2020 23:22 IST|Sakshi

సాక్షి, తిరుపతి: యస్‌ బ్యాంక్‌ ఆర్థిక సంక్షోభంలో ఉండటంతో ఇప్పటికే ఆర్బీఐ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే తాజాగా యస్‌ బ్యాంక్‌ పరిస్థితిపై ప్రమాద ఘంటికలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ముందస్తుగానే గుర్తించింది. అందులో భాగంగా టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కొన్ని నెలల కిందటే రూ.1300 కోట్ల డిపాజిట్లను ఉపసంహరణ చేశారు. గత టీడీపీ హయాంలో యస్‌ బ్యాంకు సహా నాలుగు ప్రైవేటు బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లు ఉన్న విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్‌ కాగానే డిపాజిట్ల వ్యవహారంపై దృష్టి సారించారు. నాలుగు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్థాయి సమాచారం తెప్పించుకుని పరిశీలించారు. (యస్‌లో పరిస్థితులు బాలేవు)

యస్‌ బ్యాంకు పరిస్థితులపై ప్రమాదకర ఘంటికలను టీటీడీ ముందుగానే గుర్తించి.. డిపాజిట్లను వెంటనే రిటర్న్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లను ఉపసంహరించుకోవద్దని యస్‌ బ్యాంక్‌ టీటీడీపై ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఖాతరు చేయలేదు. అదే విధగంగా ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సుబ్బారెడ్డి సూచనలు చేశారు. చివరకు యస్‌ బ్యాంకు నుంచి రూ.1300 కోట్ల డిపాజిట్లను టీటీడీ ఉపసంహరణ చేసుకుంది.

మరిన్ని వార్తలు