సొరంగ మార్గాన్ని పరిశోధించాలి

2 Jan, 2014 04:54 IST|Sakshi

హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్  : వేయిస్తంభాల దేవాలయం వాయువ్య మూలలో ఉన్న సొరంగమార్గంపై పరిశోధన లు జరగాలని, ఇప్పటికే చాలా నష్టం జరిగింద ని దేవాలయం చుట్టూ తవ్వకాలు జరపాలని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు అ న్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్‌శర్మ ఉద యం ఆరు గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, డాక్టర్లు, వ్యాపారు లు, వేలాదిమంది విద్యార్థులు, మహిళలు రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన ప్రదోషకాల పూజల్లో వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కాంతారావు, జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు పాల్గొన్నారు. ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో డీఐజీలను ఆలయ మర్యాదలతో  స్వా గతించారు. పూజల అనంతరం వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు, మహాదాశీ ర్వచనం అందజేశారు.  

ఈ సందర్భంగా డీఐజీ కాంతారావు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ కా కతీయులు త్రికుటాలయంగా నిర్మించిన వేయిస్తంభాల దేవాలయం చాలా శక్తివంతమైందని, తనకు శక్తి కావాలనుకున్నప్పుడు ఈ దేవాల యాన్ని సందర్శిస్తుంటానని తెలిపారు. 8 వం దల సంవత్సరాల క్రితం నాటి శ్రీరుద్రేశ్వర శివలింగానికి పూజలు నిర్వహించే అవకాశం రావడం మన అదృష్టమన్నారు. దేవాలయం లో సూర్యనారాయణ, కేశవమూర్తుల విగ్రహా లను ప్రతిష్ఠించాల్సి ఉందన్నారు. పురావస్తుశా ఖ సెక్రటరీగా ఉన్నప్పుడు కల్యాణ మండపం త్వరగా పూర్తి కావాలని కేంద్రపురావస్తుశాఖ అధికారులను కోరానని గుర్తుచేశారు. దేవాలయ ఈఓ వద్దిరాజు రాజేందర్ క్యూలైన్ల ఏర్పాటును, ప్రసాద వితరణను పర్యవేక్షించారు.
 

మరిన్ని వార్తలు