విడిపోతే తెలంగాణలో అల్లకల్లోమే: జగ్గారెడ్డి

16 Jul, 2013 13:09 IST|Sakshi
విడిపోతే తెలంగాణలో అల్లకల్లోమే: జగ్గారెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయని ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) అన్నారు. విడిపోతే తెలంగాణ అల్లకల్లోమవుతుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతుందని ఓ ప్రైవేటు వార్తా చానల్ తో అన్నారు. గత శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో సమర్పించిన నివేదికలో మావోయిస్టుల అంశాన్ని సీఎం ప్రస్తావించడాన్ని జయప్రకాష్ రెడ్డి సమర్థించారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఈ అంశాన్ని లేవనెత్తివుంటారన్నారు.

 ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ప్యాకేజీ తెలంగాణకు వరం అని పేర్కొన్నారు. సీఎం ప్రయత్నం సఫలమయితే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ వెనుకబడిందని ఉద్యమాలు చేస్తున్న వాళ్లు ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని జయప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. హీరో అవడానికే సీఎం సమైక్యాంధ్ర అంటున్నారన్న విమర్శల్లో అర్థం లేదని ఆయన కొట్టిపారేశారు.

మరిన్ని వార్తలు