బ్రిడ్జి మలుపే ప్రాణాలు తీసింది

24 Jul, 2015 01:44 IST|Sakshi
బ్రిడ్జి మలుపే ప్రాణాలు తీసింది

పుష్కర యాత్రికులతో వెళుతున్న రెండు కార్లు ఢీ  
ముగ్గురు మృతి
13 మందికి తీవ్రగాయూలు


పెంటపాడు: జాతీయ రహదారిపై తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలోని బ్రిడ్జి మలుపు ముగ్గురు ప్రాణాలను బలిగింది. పుష్కర యూత్రికులు ప్రయూణిస్తున్న రెండ్లు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా 13 మందికి గాయూలయ్యూరుు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ విషాద ఘటనకు సం బంధించి  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన 9 మంది గురువారం ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద పుష్కర స్నానాలు చేసి మహీంద్రా కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సందర్భంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని ఇడుపులపాడుకు చెందిన ఆరుగురు నిస్సాన్ కారులో పుష్కర స్నానాలకు వెళ్తున్నారు.

కాగా, ప్రత్తిపాడు వద్ద రైల్వే కం రోడ్డు బ్రిడ్జి దిగుతుండగా నల్లపాడుకు చెందిన మహీంద్ర కారు మలుపు తప్పించే క్రమంలో డివైడర్ దాటి కుడివైపున వెళ్తున్న నిస్సాన్ కారును రాంగ్‌రూట్‌లో వెళ్లి ఢీకొట్టింది. ప్రమాదంలో నిస్సాన్ కారులో ప్రయాణిస్తున్న ఇడుపులపాడుకు చెందిన బుడవల రామకృష్ణ (42), అదే గ్రామానికి చెందిన పుల్లెల భూషారావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న పుల్లెల భూషారావు భార్య లక్ష్మికి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో మహిళ పుల్లెల సుబ్బరావమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుడవల శైలజ, బుడవల మానస సాయికి పలుచోట్ల గాయాలయ్యాయి.

మహీంద్ర కారులో ప్రయాణిస్తున్న కొఠారి పుట్టయ్య (65) తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న షేక్ సాయి, మన్నిడి శ్రీనివాసరావు, అతని భార్య నాగమణి, అతని తల్లి సామ్రాజ్యం, బావ కొఠారి వెంకటేశ్వరరావు, చెల్లి ఆదిలక్ష్మి, చిన్నారులు శ్రావణి, గౌతమి తీవ్రంగా గాయపడ్డారు. ఏడాది చిన్నారి మన్నిడి అ నన్య స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారు.
 
స్పందించిన బీజేపీ నాయకులు
ప్రత్తిపాడుకు చెందిన బీజేపీ నాయకుడు వీర్ల గోవిందు ఆధ్వర్యంలో యువకులు క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకువెళ్లేందుకు సాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బందితో పాటు పెంటపాడు హెడ్‌కానిస్టేబుల్ నాగేంద్ర ఆధ్వర్యంలో క్షతగాత్రులను హైవే అంబులెన్‌‌సపై ఆసుపత్రులకు తరలించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, మంత్రి మాణిక్యాలరావు వ్యక్తిగత సహాయ కార్యదర్శి చిట్యాల రాంబాబు, పెదతాడేపల్లి లోటస్ స్కూల్ అధినేత బొలిశెట్టి రాజేశ్ తదితరులు క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్ గంగాధర్‌ను కోరారు.
 
మలుపు వద్ద రక్షణ చర్యలు శూన్యం
నల్లపాడుకు చెందిన మహీంద్ర కారు రైల్వే కం రోడ్డు బ్రిడ్జి దిగుతుండగా ఉన్న మలుపే ప్రమాదానికి కారణమైంది. బ్రిడ్జి దిగుతున్న సమయంలో ఎటువంటి రక్షణ చర్యలు లేవు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం, అతివేగం ప్రమాదానికి కారణాలయ్యూరు.

మరిన్ని వార్తలు