అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు : ఇద్దరు అరెస్ట్

14 Aug, 2015 16:03 IST|Sakshi

సాలూరు రూరల్ : విజయనగరం జిల్లా సాలూరు మండలం సొంపిగామ్ సమీపంలోని సిరిలిమెట్ట కొండ వద్ద అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరుపుతుండగా పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, సుమారు 11 మంది పరారయ్యారు.

పట్టుబడిన అమృతరావు, రామారావు నుంచి కొన్ని రంగురాళ్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని ఈ ప్రాంతంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు స్థానికులు చెబుతుంటారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా