టీడీపీ నేత హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

31 May, 2015 10:52 IST|Sakshi

విజయవాడ: టీడీపీ నేత పడాల కన్న హత్య కేసులో ఇద్దరు నిందితులను విజయవాడ నగర పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే కన్నా హత్య వెనక ఓ మహిళ హస్తం ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

కాగా సదరు మహిళ కోసం అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా... ఆమె అప్పటికే పరారైంది. పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతంలోనే విజయవాడ నగరంలో ఓ టీడీపీ నేత మృతికి కూడా ఆమె కారణమంటూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు