పండ్ల రసం తాగి.. ఇద్దరు చిన్నారులు మృతి

18 Dec, 2014 22:35 IST|Sakshi

కర్నూలు: జిల్లాలోని కోసిగి మండలం శాంతనూర్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పండ్ల రసం తాగిన ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. విషపూరితమైన పండ్ల రసాన్ని తాగిన కొద్ది క్షణాల్లోనే చిన్నారులు ప్రాణాలు విడిచారు. దీంతో  శాంతనూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

అందిన ప్రాథమిక సమాచారం మేరకు..  బంధువులైన సరళ, గోవర్థన్ అనే మూడేళ్ల చిన్నారులు కర్నూలు జిల్లాలోని శాంతనూర్ గ్రామంలో జరిగే జాతరను చూసేందుకు వచ్చారు. జాతరలో ఓ పండ్ల రసం బాటిల్ ను కొనుగోలు చేసి తాగి మృతిచెందారు. దాంతో విగతజీవులైన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు. జాతర చూసేందుకు వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేధన వ్యక్తం చేశారు. విషపూరితమైన పండ్లరసం తాగడం వల్లే తమ పిల్లలు చనిపోయారంటూ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు