ఇద్దరు కుమార్తెలు, తల్లి ఆత్మహత్య

21 May, 2015 02:39 IST|Sakshi
ఇద్దరు కుమార్తెలు, తల్లి ఆత్మహత్య

గంగవరం: భర్త వేధింపులు తాళలేక చిత్తూరు జిల్లా గంగవరం వుండలం వడ్డిండ్లు గ్రామానికి చెందిన మహిళ ఈశ్వరమ్మ(28) తన ఇద్దరు కువూర్తెలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుంది. వడ్డిండ్లు గ్రామానికి చెందిన జయురాం(32)తో కర్ణాటక రాష్ట్రం నంగిలికి సమీపంలోని జి.వూరేడుపల్లెకు చెందిన ఈశ్వరవ్ము(28)కు పదేళ్ల కిందట వివాహమైంది. కూలి పనులు చేసుకుని వారు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. ఇక వుగ బిడ్డలు పుట్టరనే నెపంతో రెండో పెళ్లి చేసుకునేందుకు భార్యతో జయురాం తరచూ గొడవ పడేవాడు.

ఇలా ఈశ్వరవ్ము చెల్లెల్ని వివాహం చేసుకుంటానని ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో ఆమెకు  వురో వ్యక్తితో వివాహం చేశారు. వుంగళవారం కూడా భార్యపై జయరాం  చేరుుచేసుకున్నాడు. దీంతో వునస్తాపానికి గురైన ఈశ్వరమ్మ ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురూ చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు