రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

26 Sep, 2015 16:47 IST|Sakshi

పూసపాటిరేగ ( విజయనగరం): లారీ, బైకు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కందివలస జాతీయ రహదారిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ఇద్దరు యువకులు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా మార్గమధ్యంలో కందివలస వద్ద లారీని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న వారిద్దరికీ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పెనుబాకకు చెందిన కంచిరెడ్డి సత్యనారాయణగా గుర్తించారు. మరొకరి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు