ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

22 May, 2016 04:15 IST|Sakshi
ఇద్దరు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్

115.75 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం
 

సూళ్లూరుపేట: జిల్లాలో పలు దొంగతనాలతో సంబంధాలు ఉన్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.16.97 లక్షలు విలువచేసే 115.75 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వివరించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి షార్ బస్టాండ్ సమీపంలో కొక్కు శంకరయ్య ఇంటి తాళాలు పగులగొట్టి 18 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.30 వేలు నగదు చోరీ జరిగింది. ఈ  కేసు దర్యాప్తు చేస్తుండగా చెంగాళమ్మ ఆల యం సమీపంలోని పాత చెక్‌పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఉన్న చిత్తూరు జిల్లా గుడిపాల మండలం యామ్నూరు కు చెందిన రహంతుల్లా మస్తాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.

2015 జూలైలో నెల్లూరురూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో  8 సవర్లు,  2015 లో ఏప్రిల్‌లో వెంకటగిరిలో 12 సవర్లు,  నవంబర్‌లో తడ హైస్కూల్ రోడ్డులోని ఓ ఇంట్లో 3 సవర్లు, 2016 జనవరిలో తడకండ్రిగ రాజీవ్‌నగర్‌లో మరో ఇం ట్లో ఒకటిన్న సవర, అదే నెలలో వెంకటగిరి ఓ ఇంట్లో అర సవర , ఫిబ్రవరిలో గూడూరు మార్కెట్ వీధిలో ఓ ఇంట్లో 30 సవర్ల బంగారు నగలను అపహరించినట్లు  విచారణలో తేలింది. అతని నుంచి 72 సవర్ల ఆభరణాలను స్వాధీ నం చేసుకున్నామని, వీటి విలువ రూ. 10.61 లక్షలు ఉంటుందని తెలిపారు.  

 మరో దొంగ..
 ఆనంతపురం జిల్లా తాటిపర్తికి చెందిన ఆకుల రాంబాబు (35) ప్రస్తుతం తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నివాసం ఉంటూ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మండలంలోని జంగాల పల్లిలో నాగారపమ్మ ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న ఆరున్నర సవర్ల బం గారు ఆభరణాలు, హుండీలో ఉన్న రూ. 10వేలు నగదు అపహరించాడు. నింది తుడు స్థానిక రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉండటంతో అనుమానించి పట్టుకుని విచారించగా సూళ్లూరుపేట, గూడూరు, మనుబోలు, రాపూరు, వెంకటగిరి పట్టణాల్లో సుమారు ఏడు దొంగతనాలు చేనినట్టు ఒప్పుకున్నాడని చెప్పా రు.  అతని వద్ద నుంచి 43.5 సవర్ల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ. 6,36 లక్షలు ఉంటుంది. ఈ కేసులను ఛేదిం చిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయకృష్ణ, ఎస్సైలు గంగాధర్‌రావు, సురేష్, ఐడీ పార్టీ సిబ్బందిని  అభినందించారు.

మరిన్ని వార్తలు