ఇంటర్ విద్యార్థుల దుర్మరణం

19 Jan, 2014 01:39 IST|Sakshi

 సదాశివపేట, న్యూస్‌లైన్:  రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో అనంతపద్మనాభస్వామిని దర్శించుకునేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో అనంతలోకాలకు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు వెళ్లిన ఘటన మండల పరిధిలోని పెద్దాపూర్ బస్‌స్టాఫ్ సమీపంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. విష యం తెలుసుకున్న తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరితరం కాలేదు.

పోలీసుల కథనం ప్రకారం..జహిరాబాద్ మండలం అల్లీపూర్‌కు చెందిన చంద్రయ్యస్వామి సంగారెడ్డిలో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తూ నివాసముంటున్నాడు. అతని కొడుకు శివసాయి సిద్ధార్థ(19) నిజాంపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇం టర్ చదువుతున్నాడు. అదేవిధంగా సదాశివపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ సం గారెడ్డిలో నివాసముంటున్నాడు.

అతని కొడుకు  ప్రణయ్‌రాజ్(19) చందానగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. వీరు సంగారెడ్డిలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి చదివారు. మరికొందరు పదోతరగతి పూర్వ విద్యార్థులతో వారు సంక్రాంతి సెలవుల్లో భాగంగా వికారాబాద్‌లోని అనంతగిరి కొండలకు మూ డు బైక్‌లపై శనివారం బయలుదేరారు. అయితే ఒకే బైక్‌పై ఉన్న శివసాయిసిద్ధార్థ, ప్రణయ్‌రాజ్‌లు పెద్దాపూర్ బస్‌స్టాఫ్ వద్దకు రాగానే అదుపు తప్పి కిందపడిపోయారు. వీరి వెనక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అజాగ్రత్తగా ఉండడంతో వారిపై నుంచి వెళ్‌లింది. దీంతో ఆ ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందా రు.

 విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బోరున విల పించారు. ప్రయోజకులవుతారనుకున్న తమ పిల్లలు ఇలా అర్ధాంతరంగా అనంతలోకాలకు వెళ్లి తమకు కడుపుకోత విధించారని ఏడువడం అక్కడున్నవారిని కలచివేసింది.

 విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలకు సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించారు. అనంతరం కుటుం బసభ్యులకు అప్పగించారు. మృతుడు సిద్ధార్థ తండ్రి చంద్రయ్యస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐలు రాములుగౌడ్, ఆరీఫ్‌లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు