బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు

27 Dec, 2014 03:15 IST|Sakshi

తెలంగాణ, ఉత్తర కోస్తాల్లో చలి తీవ్రత
 సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఒకటి శుక్రవారం సాయంత్రం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి వెనువెంటనే బలపడింది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి ఆనుకుని ఉంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది బలపడి వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారనుంది.
 
  వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఈ నెల 29, 30 తేదీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్రలలో చలి తీవ్రంగా ఉంటుందని వెల్లడించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో చలి విజృంభిస్తుందని వివరించింది. హైదరాబాద్‌లో వచ్చే రెండ్రోజులు 11 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలుంటాయని తెలిపింది.

>
మరిన్ని వార్తలు