ఇద్దరికి ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డులు

6 Nov, 2013 04:55 IST|Sakshi

కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డులకు కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. భార త ప్రభుత్వ కేంద్ర యువజన క్రీడల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయసేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్)లో సామాజిక సేవాకార్యక్రమంలో చురుకుగా భాగస్వాములైన ప్రోగ్రాం అధికారులు, వలంటీర్లకు ఏటా ఇందిరాగాంధీ జాతీయ అవార్డులు అందజేస్తుంటారు. ఈ మేరకు కాకతీయ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్ పీఓ శ్రావణ్‌కుమార్, కేయూ లో ఎంఏ ఇంగ్లిష్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వలంటీర్ మహ్మద్ అజమ్ అవార్డులకు ఎంపికయ్యా రు. ఈనెల19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించనున్న జాతీయ సమైక్యత దినోత్సవంలో ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు. ఈ సందర్భంగా వీరిని కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌లాల్, డాక్టర్ మనోహరాచారి అభినందించారు.
 23 ఏళ్లుగా ఎన్‌ఎస్‌ఎస్ పీఓ
 వరంగల్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ 23 ఏళ్లుగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నా రు. వలంటీర్లలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించడంతోపాటు వివిధ సామాజిక సేవకార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఎంఏ హిందీ పూర్తిచేసి 1984లో కరీంనగర్ జిల్లా బెజ్జంకి కళాశాలలో హిందీ లెక్చరర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. 1991 నుంచి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారిగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములతున్నారు. 2005 లో డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హన్మకొండ కేడీసీలో హిందీ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్వయంగా 15 సార్లు రక్తదానం చేసి వలంటీర్లలో అపోహలు తొలగించేందుకు కృషి చేశారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 24న రాష్ట్రస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ అవార్డును కూడా అందుకున్నారు. ఇప్పు డు ఏకంగా ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రశంసాపత్రంతోపాటు *90వేల నగదు రాష్ట్రపతి చేతులమీదుగా అం దుకోనున్నారు. ఇందులో *70 వేలు కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగానికి ఆయన వెచ్చించాల్సి ఉంటుంది.
 ఆరేళ్లుగా వలంటీర్..
 కరీంనగర్ జిల్లాకు చెందిన మహ్మద్ ఆజమ్ ఆరేళ్లుగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్‌గా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. మేఘాలయ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలోని జాతీయసమైక్యత శిబిరాలు, అంతర్‌రాష్ట్ర యువజన సదస్సులు, ప్రత్యేక శీతాకాల శిబిరాలో ప్రతిభ కనబర్చాడు. 2009లో వరద బాధితుల కోసం ఎన్‌ఎస్‌ఎస్ నాయకత్వంలో *10వేలు, పుస్తకాలు సేకరించారు. జిల్లాస్థాయి ఎన్‌ఎస్‌ఎస్ యు వజనోత్సవాల్లో బంగారు పతకం సాధించిన ఆజమ్ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ వలంటీర్ అవార్డు అం దుకున్నారు. ప్రస్తుతం అవార్డు కింద *15వేలు నగ దు పారితోషికం, ప్రశంసాపత్రం అందుకుంటారు.

మరిన్ని వార్తలు