ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు

20 Aug, 2014 11:55 IST|Sakshi
ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు రానున్నాయి. వీటిని చిత్తూరు, కాకినాడలలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం నూజివీడు, కడప రెండుచోట్ల మాత్రమే ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వీటికి ఆదరణ బాగుండటం, ఎక్కువ మంది విద్యార్థులు వీటివైపు మొగ్గు చూపడంతో అదనంగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం నాటి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

ఇక విజయవాడ - కాకినాడల మధ్య గ్రీన్ఫీల్డ్ పోర్టు ఏర్పాటుచేస్తామన్నారు. ప్రైవేటు రంగంలో కాకినాడలో మరో వాణిజ్య పోర్టును నెలకొల్పుతామని, కాకినాడలో ఇంపోర్టేషన్‌ టర్మినల్‌ , విశాఖ జిల్లా గంగంవరం పోర్టు దగ్గర మరో ఇంపోర్టేషన్‌ టర్మినల్‌  ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప విమానాశ్రయాలను విస్తరిస్తామన్నారు. ఇక మచిలీపట్నం పోర్టును ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు