ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

6 Mar, 2014 02:05 IST|Sakshi

ఆర్ గొల్లహళ్లి (రొళ)్ల, న్యూస్‌లైన్ :  కర్ణాటక ప్రాంతం ఆర్ గొల్లహళ్లికి చెందిన సిద్ద గంగప్ప కుమారుడు రమేష్(15) టీడీ పల్లి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌రూ. ఆంజనేయులు, బంధువుల ఫిర్యాదు మేరకు..రెడ్డిహళ్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రమేష్ సక్రమంగా చదువుకోక పోవడంతో పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో 40 రోజుల క్రితం రొళ్లకు వెళ్లొస్తానంటూ ఇంట్లో రూ.20 డబ్బు ఇప్పించుకుని వెళ్లాడు. అప్పటి నుంచి రమేష్ కనిపించలేదు.
 
 దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బెంగళూరు, తుమకూరు, మధుగిరి, పావగడ, శిర తదితర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. బుధవారం సాయంత్రం గొర్రెల కాపర్లు చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతున్న బాలుడి మృతదేహాన్ని చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో ఒక సెల్‌ఫోన్, రూ.10 డబ్బు, సైకిల్ తాళాలు లభ్యమయ్యాయి. సిమ్ కార్డు ఆధారంగా అతని బంధువులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు గుర్తు పట్టి బోరున విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌రూ. తెలిపారు.
 
 విద్యార్థిని ఆత్మహత్య
 అనంతపురం క్రైం: స్థానిక వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సంఘమేశ్వరనగర్‌కు చెందిన వినుత(17) బుధవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాధిత కుటుంబ సభ్యులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన ఆమె సాయంత్రమైనా బయటకు రాలేదు. దీంతో ఆమె తాత రిటైర్డ్ నేవీ ఉద్యోగి హనుమంతురెడ్డి ఎంత పిలిచినా పలకలేదు. అనుమానంతో ఆయన కిటి కీలోంచి లోపలకు చూడగా వినుత ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వన్‌టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చూరీ గదికి తరలించారు. తన చావుకు ఎవరు బాధ్యులు కారని, తాతయ్యతో పాటు కుటుంబ సభ్యులను వదిలి వెళుతున్నానంటూ వినుత ఆ లేఖలో పేర్కొందని ఎస్‌రూ. జాకీర్‌హుస్సేన్ తెలిపారు. తండ్రి లేని ఆమె కొంత కాలంగా చదువులో వెనుకబడి ఉండడంతో ఒత్తిడి గురయ్యేదని,దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
 

మరిన్ని వార్తలు