ఇద్దరు మహిళలు, ఒక బాలుడి అదృశ్యం

6 Feb, 2015 00:15 IST|Sakshi
ఇద్దరు మహిళలు, ఒక బాలుడి అదృశ్యం

 యానాం టౌన్: యానాంలోని అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న ఇద్ద రు మహిళలు, ఒక బాలుడు అదృశ్యమయ్యారు. వివాహితలు దారా కృష్ణవేణి, దారా లలితాదేవి, బాలుడు అఖిల్‌కుమార్ గత నెల జనవరి 18 నుంచి కనిపించడం లేదని భర్త దారా రవికుమార్ బుధవారం సాయంత్రం యానాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏఎస్సై అబ్బులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...దారా రవికుమార్‌కు తొమ్మిది సంవత్సరాల క్రితం కృష్ణవేణితో వివాహం జరిగింది. అయితే కృష్ణవేణి అనారోగ్యం దృష్ట్యా ఆమె చెల్లెలు లలితాదేవిని కూడా రవికుమార్‌కు ఇచ్చి వివాహం చే శారు. కృష్ణవేణి కుమారుడు అఖిల్‌కుమార్. ఈ కుటుంబం కొంతకాలంగా స్థానిక అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తోంది. లలితాదేవిని రవికుమార్ బీఈడీ చదివిస్తున్నాడు. అయితే ఆమె క్లాసులకు సరిగ్గా వెళ్లడం లేదని భర్త రవికుమార్ మందలించాడు. అదే రోజు నుంచి వారు కనిపించడం లేదని రవికుమార్ తమకు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రవికుమార్ గుల్ల వ్యాపారం చేస్తున్నాడన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు