కాణిపాకంలో టవరెక్కిన ఆలయ మాజీ సిబ్బంది

1 Sep, 2015 15:37 IST|Sakshi

కాణిపాకం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించిన సిబ్బంది గడువు ముగియడంతో సోమవారం వారిని విధుల నుంచి తొలగించారు. దాంతో మనస్థాపానికి గురైన వసంత్, అరుణ్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆలయంలో పనిచేసేందుకు 126 మంది సిబ్బందిని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నారు. వారి కాంట్రాక్టు గడువు మూడేళ్లు నిన్నటితో ముగియడంతో ఆలయ ఈవో పాత ఏజెన్సీని రద్దు చేసి కొత్త ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చారు.

అయితే తొలగించిన 126 మందిలో ఇద్దరు మంగళవారం ఉద్యోగాలు పోవడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ టవర్ ఎక్కారు. ఆందోళనకారులు ఆలయ ఈవోను ఘెరావ్‌ చేశారు. దీంతో ఆలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కొత్త ఏజెన్సీకి ఆలయ ఉభయదార్లు మద్దతు ప్రకటిస్తుండగా, కొత్త ఏజెన్సీవారికి బోర్డు సభ్యుల మద్దతు ఉంది. దాంతో సమస్య జటిలంగా మారింది. కాణిపాకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరి సెల్ టవర్ ఎక్కినవారిని దిగమని విన్నవిస్తున్నారు. ఆందోళనకారులు దిగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

మరిన్ని వార్తలు