స్కాన్ ఉన్నా ప్రయోజనం సున్నా..

25 Jan, 2016 19:21 IST|Sakshi

 ఈఎస్‌ఐలో రెండేళ్లుగా రేడియూలజిస్ట్‌ను నియమించని వైనం
  రోగులకు తప్పని ఇక్కట్లు
 
 విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్ సౌకర్యం ఉన్నప్పటికీ రోగులకు ఉపయోగపడడం లేదు. స్కాన్ చేసే రేడియాలజిస్టు లేకపోవడం వల్ల గర్భిణులు, జీర్ణకోశ వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. రూ.లక్షలు వెచ్చించి స్కానింగ్ పరికరాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం రేడియూలజిస్ట్‌ను నియమించకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల కిందట సుమారు 8 లక్షల రూపాయలు వెచ్చించి అల్ట్రాసౌండ్ స్కాన్ పరికరాన్ని కొనుగోలు చేశారు.  
 
 19 వేల కుటుంబాలకు ఆధారం
 ఈఎస్‌ఐ డయోగ్నోస్టిక్ సెంటర్ పరిధిలో సుమారు 19 వేల కుటుంబాలున్నారుు. వీరంతా వైద్య సేవల కోసం ఈ సెంటర్‌కే వస్తుంటారు. అయితే అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరమయ్యే రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. దీంతో వారంతా వేరే ఆస్పత్రుల్లో స్కాన్ చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
 
 నెలకు రూ. 30 వేల ఖర్చు
  ఈఎస్‌ఐ ఆస్పత్రికి నెలకు 50 నుంచి 60 మంది గర్భిణులు వెళ్తుంటారు. వీరికి ఇతర ఆస్పత్రుల్లో స్కాన్ చేయడం కోసం ప్రభుత్వం నెలకు రూ. 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. మిషన్ ఉండి కూడా ఇలా డబ్బులు ఖర్చు చేయడమేమిటని రోగులు ప్రశ్నిస్తున్నారు. రేడియూలజిస్ట్‌ను నియమిస్తే అటు రోగులకు సేవలందడంతో పాటు ఇటు ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఈఎస్‌ఐ సూపరింటిండెంట్ టి.వి.రమణయ్య వద్ద సాక్షి ప్రస్తావించగా త్వరలోనే  రేడియాజిలిస్టు పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు