ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి

20 Apr, 2017 18:09 IST|Sakshi
ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ నాయకుడు సి. రామచంద్రయ్య ప్రతిపక్ష నేతగా ఉండేవారు. అయితే ఆయన పదవీకాలం ముగియడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా కూడా ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ప్రతిపక్ష నాయకుడిని ఎంచుకునే అవకాశం వైఎస్ఆర్‌సీపీకి వచ్చింది. సీనియర్ నాయకుడైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు